నరసరావుపేట, నవంబర్ 21, డైనమిక్ న్యూస్
కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలపై నరసరావుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం విశ్రుత ప్రచారం చేస్తోంది. వివిధ గ్రామాలలో సామాజిక భద్రత పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఆర్థిక సంస్థల మోసాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై అవగాహనతో పాటు అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, పీఎమ్ జేజేబివై, పీఎమ్‌ఎస్‌బివై వంటి పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నారు.
పీఎమ్‌జేజేబివై కింద 2 లక్షల భీమా అందజేత
పమిడిపాడు అగ్రహారం గ్రామానికి చెందిన బోయపాటి రాధ అనారోగ్యంతో మరణించగా, ఆమె కుటుంబం పీఎమ్‌జేజేబివై పథకం కింద ఆర్థిక సహాయం పొందింది. నరసరావుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సహకారంతో రూ. 2,00,000 భీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ యస్. చిన్నారావు, ఆర్థిక అక్షరాస్యత ప్రాజెక్టు డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ వి. అశోక్ కుమార్, స్టేట్ కో ఆర్డినేటర్ బాబు రావు, జిల్లా కో ఆర్డినేటర్ బి. నరసింహ నాయక్, తాళ్లపోగు అశోక్, కంభంపాటి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
