కోదాడ ,చిలుకూరు,నవంబర్ 10 డైనమిక్
చిలుకూరు మండల పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ దుర్మరణం చెందాడు.
రెండు వాహనాల ఢీకొనడం
వివరాల్లోకి వెళ్తే, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న TS04UC3388 నెంబర్ గల లారీ, ఆంధ్రా నుండి హుజూర్నగర్ వైపు వెళ్తున్న TS33T2544 నెంబర్ గల బొలెరో వాహనాన్ని సోమవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చిలుకూరు సమీపంలోని మీట్స్ కాలేజీ వద్ద ఢీకొట్టింది.
ఘటనా స్థలంలోనే మృతి
ఈ ప్రమాదంలో బొలెరో వాహనం తీవ్రంగా దెబ్బతినగా, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న చిలుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికుల ఆందోళన
ఈ ప్రమాదం కారణంగా కొంతసమయం పాటు రహదారి పై ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు ప్రమాదకరమైన రహదారి మలుపు వద్ద వేగాన్ని నియంత్రించాలంటూ డ్రైవర్లను హెచ్చరించారు.

