డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 2
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేరేడుచర్ల భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. పట్టణ కేంద్రంలో బీజేపీ నేతలు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించి రేవంత్ రెడ్డిని తీవ్రంగా తప్పుపట్టారు.పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొనతం నాగిరెడ్డి, మండల అధ్యక్షుడు చింతకుంట్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
నాయకులు మాట్లాడుతూ —
“రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశాన్ని, భారత సైన్యాన్ని అవమానపరిచేలా ‘పాకిస్తాన్ తన్నింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదు” అని తీవ్రంగా విమర్శించారు.వెంటనే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకీడు మండల అధ్యక్షుడు రమావత్ నరీనాయక్, ఉరిమల్ల రామ్మూర్తి, తాళ్ల నరేందర్ రెడ్డి, ఏమీ రెడ్డి శంకర్ రెడ్డి, కాలం నాగయ్య, ఆకుల జగతయ్య, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంధం శావయ్య, మెట్టు మధు, వెన్నం సురేష్, బుస్స విమల, అంబటి నాగేశ్వరరావు, నారద మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
