హైదరాబాద్ ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 20
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’లో ఈ వారం మరో ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈసారి నటుడు భరణి హౌస్ నుంచి బయటకు వెళ్లారు.ఈ సీజన్‌లో సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వడం వల్ల ప్రేక్షకులలో విశేష ఆసక్తి నెలకొంది.ఈ వారం నామినేషన్లలో ఆరుగురు ఉన్నప్పటికీ, ఒక్కొక్కరూ సేవ్ అవుతుండగా చివరకు భరణి, రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో నిలిచారు.
ఫలితంగా భరణి ఎలిమినేట్ అయ్యారు.
ఎలిమినేషన్ ప్రకటన సమయంలో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. భరణి పేరు ప్రకటించగానే తనూజ, దివ్య కంటతడి పెట్టారు.
బయటకు వస్తూ భరణి మాట్లాడుతూ –
“ఇమ్మాన్యుయేల్, మనం అడుగు పెట్టిన రోజు నుంచే చెప్పుకున్న మాట నువ్వు నిలబెట్టాలి. తనూజ, నువ్వు నీలాగే ఉండు. ఆల్ ది బెస్ట్,” అని అన్నారు.దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌గా ప్రసారమైన ఈ భాగంలో హీరో సుధీర్ బాబు, హీరోయిన్ సోనాక్షి సిన్హా అతిథులుగా విచ్చేశారు.వీరిద్దరూ నటించిన ‘జటాధర’ సినిమా విశేషాలను పంచుకుంటూ హౌస్‌లో సందడి చేశారు.
