Monday, March 2, 2026
Homeతెలంగాణఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

సూర్యాపేట పట్టణం 38వ వార్డు లో ఘనంగా కార్యక్రమం

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 17

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సూర్యాపేట పట్టణంలో కొత్తగా మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి,” అని సూచించారు.భూమిపూజ కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో లబ్ధిదారు తాటి కృష్ణవేణి (భర్త శ్రవణ్) ఇంటి వద్ద జరిగింది.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గండూరి రమేష్ పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments