Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనేరేడు చర్ల గోదాంలో హమాలీల మాముల డబ్బులు మాయం  వెనుక –సిబ్బంది సూత్రధారుల నెట్‌వర్క్‌

నేరేడు చర్ల గోదాంలో హమాలీల మాముల డబ్బులు మాయం  వెనుక –సిబ్బంది సూత్రధారుల నెట్‌వర్క్‌

నేరేడు చర్ల గోదాంలో హమాలీల మాముల డబ్బులు దొంగతనం వెనుక –సిబ్బంది సూత్రధారుల నెట్‌వర్క్‌

డైనమిక్,నేరేడు చర్ల, అక్టోబర్ 22

నేరేడు చర్ల మండలంలోని గోదాంలో చోటుచేసుకున్న హమాలీ కూలీల మాముల దొంగతనం ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. కూలీల చెమట చిందించి సంపాదించిన డబ్బులు కొందరి లంచగొండితనానికి బలి అయ్యాయి. ఈ వ్యవహారంలో ఆఫీస్‌ సిబ్బంది, హమాలీ మేస్త్రి మద్య అంతర్గత సూత్రధారుల నెట్‌వర్క్‌ ఉన్నట్టు బహిర్గతమవుతోంది.

హమాలీల మాములు డబ్బులు మాయం – ₹1.18 లక్షల గల్లంతు

నేరేడు చర్ల గోదాములో పనిచేసే హమాలీ కూలీలకు చెల్లించాల్సిన మాములు నుంచి ₹1,18,000 రూపాయలు మాయం అయ్యాయి.ఈ డబ్బులు హమాలీ మేస్త్రి, వేమెంట్ ఆపరేటర్‌, టెక్నిషియన్‌ TA అనే ముగ్గురు వ్యక్తులు కలసి అక్రమంగా వాడుకున్నట్లు బయటపడింది.కానీ ఈ విషయం పెద్ద స్థాయిలో బయటకు రాకుండా మేనేజర్‌ ఆసిఫాబీ గుట్టుగా పంచాయతీ పేరిట వ్యవహారాన్ని ‘లోపలే’ సర్దుకోవడమే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

మేనేజర్‌ గుట్టుచప్పుడు కాకుండా పంచాయతీ

విషయం వెలుగులోకి రాగానే మేనేజర్‌ ఆసిఫాబీ గోదాం పరిధిలోనే పంచాయతీ జరిపి, హమాలీ మేస్త్రి వద్ద నుండి మాముల డబ్బులను వసూలు చేయించారు.
అయితే ఈ ప్రక్రియ పూర్తిగా ఎటువంటి రాతపూర్వక విచారణ లేకుండా సాగింది.
మేస్త్రిని తక్షణమే పనిలో నుండి తొలగించినప్పటికీ, మిగతా ఇద్దరు సిబ్బంది మాత్రం యథావిధిగా పనిచేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

మేస్త్రి మళ్ళీ తిరిగి డిమాండ్‌తో కలకలం

రెండు రోజుల తర్వాత నిన్న మంగళవారం మేస్త్రి తిరిగి హాజరై “నేను ఒక్కడినే కాదు, ఆఫీస్‌ సిబ్బంది ముగ్గురం కలిసి డబ్బులు తీసుకున్నాం. నన్నే ఎందుకు తప్పుపట్టారు?” అని మేనేజర్‌ని నిలదీశాడు.ఇక తాను తిరిగి పనిలో చేరాలని డిమాండ్‌ చేసిన మేస్త్రికి, హమాలీ కూలీలు ₹50,000 జరిమానా కట్టితేనే తిరిగి తీసుకుంటాం అంటూ షరతు పెట్టడం కలకలం రేపింది.

మేనేజర్‌ సమాధానం ‘మోసం’ కంటే ప్రమాదకరం

విషయంపై వివరణ కోరగా

మేనేజర్‌ ఆసిఫాబీ —“అది మా పరిధి కాదు. హమాలీ కూలీల మధ్య పంచాయతీ వ్యవహారం” 1,18000 కాజేసిన విషయం వాస్తవమే అని సమాధానం ఇచ్చారు.ఇది విన్నవారంతా ఒక్కసారిగా ప్రశ్నిస్తున్నారు —

“గోదాం నిధులు కూలీలవే అయినా, ఆ నిధులు గోదాం నుంచి పోయాయి కదా?
అయితే అది మేనేజర్‌ పరిధిలోకి రాదా?”

మేనేజర్‌ సమాధానం సందేహాస్పదమై, కూలీల డబ్బుల మాయం వెనుక ఉన్న అసలు నెట్వర్క్‌ దాచడానికే అని భావిస్తున్నారు.

ఆఫీస్‌ సిబ్బందిపై పెరుగుతున్న అనుమానాలు

గోదాంలో పనిచేసే కొంతమంది టెక్నిషియన్లు, వేమెంట్ ఆపరేటర్లు కూలీల ఖాతా లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.కూలీల వేతనాలు సరిగ్గా క్రెడిట్‌ కాకుండా, కొంత మొత్తం నగదుగా చేతులు మారుతుండటం సాధారణమైందని వారు చెబుతున్నారు.
అయితే మేనేజర్‌ ఈ అవకతవకలపై కన్నెత్తి చూడకుండా ఉండడం, “దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న సంకేతాలు” ఇస్తోంది.

కూలీల ఆవేదన

హమాలీలు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.మా చెమటతో సంపాదించిన డబ్బులు మాయమవుతున్నాయి.మేస్త్రి ఒక్కరే కాదు, ఆఫీస్‌లో ఉన్నవాళ్లు అందరూ వాటా పంచుకున్నారు.మేనేజర్‌ మాకు న్యాయం చేయకుండా వారిని కాపాడుతున్నాడు” అని వారు ఆగ్రహంగా చెబుతున్నారు.వారు జిల్లా అధికారులను కలసి సమగ్ర విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గోదాం లలో అవినీతి కూడు

ఈ సంఘటనతో మరోసారి బయటపడింది — గోదాం వ్యవస్థలో ఉన్న అవినీతి, అజమాయిషీ, పర్యవేక్షణ లోపాలు.
మేనేజర్‌ సానుకూల సహకారంతో సిబ్బంది దుర్వినియోగం చేయడం కూలీల జీవనోపాధిని కుదిపేస్తోంది.అధికారులు తక్షణ విచారణ చేపట్టకపోతే ఈ నెట్‌వర్క్‌ మరింత బలపడే ప్రమాదం ఉంది.

తేల్చాల్సిన కీలక ప్రశ్నలు

హమాలీ కూలీల వేతనాలు మాయం అయ్యే వరకు మేనేజర్‌ ఎక్కడ ఉన్నారు?

ఆఫీస్‌ సిబ్బంది ప్రమేయం ఉన్నా వారిపై చర్య ఎందుకు లేదు?

పంచాయతీ పేరుతో గుట్టుగా వ్యవహరించడమేమిటి?

జరిమానా ₹50,000 నిర్ణయం వెనుక ఎవరికి లాభం?కూలీల కష్టానికి తగిన గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థే ఇప్పుడు అవినీతి అడ్డాగా మారింది.
నేరేడు చర్ల ఘటన కేవలం ఒక్క గోదాం వ్యవహారం కాదు — ఇది సిస్టమ్‌ లోపల ఉన్న అవినీతి గొలుసులోని ఒక లింక్‌ మాత్రమే.పైస్థాయి అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించి మేనేజర్‌–సిబ్బంది నెట్‌వర్క్‌ను బహిర్గతం చేయకపోతే,హమాలీల చెమట డబ్బులు ఇలా మాయమవడం కొనసాగుతూనే ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments