డైనమిక్ న్యూస్,అక్టోబర్ 29,నల్లగొండ జిల్లా
పెద్దావూర పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ప్రసాద్ మండల ప్రజలకు బుదవారం విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం “మొంథా” తుఫాన్ ప్రభావంతో మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, చెరువులు, వాగులు నిండుకుండాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దు
“ఇప్పటికే చాలా చెరువులు మత్తడి పొసే పరిస్థితిలో ఉన్నాయి. వాగులు పొంగే అవకాశం ఉంది. ఎవ్వరూ వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయకండి,” అని ఎస్‌ఐ సాయి ప్రశాంత్ సూచించారు.
రోడ్డుపై ప్రయాణించే సమయంలో గుంతలు, మట్టి ప్రాంతాలను గమనించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
పోలీసులు ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉన్నారు
“మీ క్షేమం మా బాధ్యత. పోలీస్ ఉన్నది మీ కోసమే,” అని ఎస్‌ఐ స్పష్టం చేశారు.
ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు అందకి అప్రమత్తతే రక్షణ
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని, ప్రభుత్వం మరియు పోలీస్ విభాగం నుండి అందుతున్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
