Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంబక్కయ్యగూడెం రేషన్ షాప్‌లో నాసిరక సన్నబియ్యం కలకలం లబ్ధిదారుల్లో ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల...

బక్కయ్యగూడెం రేషన్ షాప్‌లో నాసిరక సన్నబియ్యం కలకలం లబ్ధిదారుల్లో ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,నవంబర్ 17

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సన్నబియ్యం నాణ్యతపై మరోసారి ప్రశ్నార్థక చిహ్నం నెలకొంది. బక్కయ్యగూడెం రేషన్ షాప్‌లో నవంబర్ నెల పంపిణీ సమయంలో నాసిరకం బియ్యం బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది. బియ్యం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారు సంచిని తెరిచి చూడగా, ఒకబస్తాలో పురుగులు, బూజు, బియ్యపు ఉండలు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యత తనిఖీలలో పౌర సరఫరా అధికారుల వైఫల్య

గ్రామస్థులు పేర్కొన్న వివరాల ప్రకారం —

రేషన్ షాపులకు వచ్చే బియ్యం నాణ్యతను పౌర సరఫరా సప్లై అధికారులు సరిగా పరిశీలించడం లేదని, చాలా సార్లు తరుగు పై ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన రావడం లేదని అన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నాసిరక స్టాక్ పంపిణీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనతో పౌర సరఫరా సప్లై శాఖ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు నెలకొన్నాయి.

“మేమూ ఇబ్బందుల్లోనే” – డీలర్ కోన సత్యం

స్టాక్‌పై స్పందించిన రేషన్ డీలర్ మాట్లాడుతూ—

“50 కేజీలుగా రావాల్సిన బస్తాలు 47 కేజీలుగా వస్తున్నాయి. మేమే తరుగులు మా జేబు నుంచి ఇవ్వాల్సి వస్తోంది. ఇలా అయితే డీలర్లుగా కొనసాగడం కష్టం” అన్నాడు.మధ్యం మధ్యలో ఇలాంటి నాసిరకం సంచులు వస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినాపట్టించుకోవడం లేదు. సమస్యలు వచ్చినా మాపైనే చూపిస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామస్థుల మాటల్లో కూడా డీలర్‌పై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా,“అసలు సమస్య అధికారులు నాణ్యతపై శ్రద్ధ పెట్టకపోవడమే” అని వారు స్పష్టం చేస్తున్నారు.పౌరుల ప్రశ్న – “మన ఆరోగ్యంకి ఎవరు బాధ్యత?”నాసిరకం బియ్యం చేతికి రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలా ప్రశ్నిస్తున్నారు—“పిల్లలకైనా ఇలాంటి బియ్యం తినిపించాలా?”“ప్రతీ నెల సమస్య ఎందుకు వస్తోంది?”“అధికారులు ఎందుకు గ్రామాలకు వచ్చి తనిఖీ చేయరు?”

అధికారుల స్పందనపై లబ్ధిదారుల డిమాండ్

ఈ ఘటన నేపథ్యంలో గ్రామస్థులు జిల్లా అధికారులను నేరుగా ప్రశ్నిస్తూ “ఇలాంటీ నాసిరకం బియ్యం ఇకపై పంపిణీ చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి”
అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.నాసిరకం స్టాక్‌ను తక్షణమే నిలిపివేయాలని,నాణ్యత తనిఖీలను కఠినతరం చేయాలని,సరఫరాలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో అన్నదానిపై ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments