Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంఅయ్యప్ప మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్6

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ వేడుకకు నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన శ్రీ కృష్ణ కామేశ్వరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాముల మహా పడిపూజ మహోత్సవంలోపాల్గొన్నారు.మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి నిర్వాహకులు శాలువా కప్పి ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, శివయ్య స్వాములు, దుర్గామాత స్వాములు, వెంకటేశ్వర స్వాములు, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments