డైనమిక్,కారంపూడి, అక్టోబర్ 18
కారంపూడి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్‌స్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సోలార్ శక్తి ప్రాధాన్యంపై ప్రజలకు వివరాలు తెలియజేశారు.
విద్యుత్ శాఖ లైన్‌మెన్ వై. గోపాల్ మాట్లాడుతూ,
“సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లులో గణనీయమైన తగ్గింపును పొందవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకం ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున లబ్ధి పొందవచ్చు” అని తెలిపారు.సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని గోపాల్ పిలుపునిచ్చారు. “ప్రజల్లో సోలార్ విద్యుత్ పై అవగాహన పెంచడం మా ఉద్దేశ్యం” అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ గౌరీశంకర్, సబ్ ఇంజనీర్ సిద్దేశ్వరరావు, లైన్‌మెన్లు హరికృష్ణ, పరమేశ్వరరావు, ఏఎల్‌ఎం కామేశ్వరరావు, బాషా, అబ్బాస్, సాంబయ్య, అరుణ, నాగలక్ష్మి, సైదారావు, శ్రీను నాయక్, సెల్వరాజు తదితర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
