Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనల్లగొండ జిల్లా ఆసుపత్రిలో ‘విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన’ దినోత్సవంచట్టాలపై అవగాహన...

నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో ‘విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన’ దినోత్సవంచట్టాలపై అవగాహన అత్యంత అవసరం : భీమార్జున్ రెడ్డీ

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 12

నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో “విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన” దినోత్సవం సందర్భంగా, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్షరాస్యత ఎంత అవసరమో చట్టాలపై అవగాహన (లీగల్ లిట్రసి) కూడా ప్రతి పౌరుడికి అంతే ముఖ్యం అని తెలిపారు. చట్టాలపై అవగాహన ఉంటేనే మనిషి సమాజంలో ఆత్మగౌరవంతో జీవిస్తూ, తన హక్కులను కాపాడుకుంటూ, అన్యాయానికి గురికాకుండా నిలబడగలడని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని, అవసరమైన సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఆరోగ్యం ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కు : డాక్టర్ నాగేష్

సమావేశంలో మాట్లాడిన ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ మాట్లాడుతూ, ఆరోగ్యం ప్రతి పౌరుడికి రాజ్యాంగం అందించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు, సబ్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సి.హెచ్.సీలు, ఏరియా మరియు జిల్లా ఆస్పత్రుల ద్వారా 24 గంటలు ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల సమన్వయంతో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

వివిధ ఆరోగ్య–చట్టాలపై అవగాహన : డాక్టర్ తిరుపతిరావు

జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, గర్భవిచ్ఛితి చట్టం, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PCPNDT), బాల్య వివాహాల నిషేధ చట్టం, సి‌ఓటి‌పి చట్టం వంటి కీలక ఆరోగ్య, సామాజిక రక్షణ చట్టాలపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.

వైద్యుల–సిబ్బంది–విద్యార్థుల పాల్గొనడం

జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments