డైనమిక్,నేరేడు చర్ల ,అక్టోబర్17
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ తెలిపారు.నేరేడుచర్లలో తహసీల్దారు కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ మరియు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా ఉద్దేశించి వారు మాట్లాడుతూ సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి చేయడం అంటే న్యాయ వ్యవస్థ పై దాడి చేయడమేనని, మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని,మన రాజ్యాంగం పై దాడి చేయడమేనని మన లౌకిక వ్యవస్థ పై దాడి చేయడమేనని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కిషోర్ రాకేష్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని, ఆయన డిమాండ్ చేశారు.సనాతన ధర్మం పట్ల జస్టిస్ గవాయి తన అభిప్రాయాన్ని తెలియజేశాడని అది అతనికున్న వాక్ స్వాతంత్రంలో భాగమని గుర్తించకుండా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనే వంకతో న్యాయమూర్తి పైన కాలి బూటుతో దాడి చేయడాన్ని దేశ ప్రజలందరూ గమనించాలని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో అభ్యుదయ వాదులను లౌకికవాదులను భౌతికంగా హతమారు స్తున్నారని అందుకు ఉదాహరణ గౌరీ లంకేష్ మరియు గోవింద పన్సారే లాంటి హత్యలే ఇందుకు ఉదాహరణ అని సనాతన ధర్మానికి కాలం చెల్లి పోయిందని, జస్టిస్ గవాయ్ అభిప్రాయపడితే భౌతిక దాడికి దిగుతారా అని ఇదేనా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని ఇదే నా దేశభక్తి అంటే అని ఇలాంటి దేశద్రోహులవల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశం తల దించుకునే పరిస్థితి దాపురిస్తుందని ఈ దేశంలో మాట్లాడే అర్హతను ప్రజలు కోల్పోయారా అనే అనుమానం వస్తుందని అతడు ఏదైనా తప్పు మాట్లాడితే న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప భౌతిక దాడులకు దిగటం అది కోర్టు హాల్లోనే సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యడవల్లి చంద్రయ్య బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను,బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఇంజమూరి శంకర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ చందమళ్ల గోపి అపరారపు వెంకన్న సాయి లక్ష్మణరావు ఉన్నారు
