కొండమల్లెపల్లి ,డైనమిక్, అక్టోబర్ 20
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలో మానసిక కలతతో ఓ తల్లి చేసిన దారుణం విషాదం నింపింది. ఇద్దరు చిన్నారులను హతమార్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది.
తెల్లవారుజామున ఘోరం
సోమవారం తెల్లవారుజామున కొండమల్లెపల్లిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో పొరుగువారు వెళ్లి చూడగా ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు
మృతులది స్వగ్రామం బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో మానసిక ఆవేశంలో తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసులు దర్యాప్తు ప్రారంభం
స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
