Tuesday, March 3, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పల్నాడు గురుకులంలో దారుణం! ఐదు రోజులుగా విద్యుత్, నీరు లేక విద్యార్థినుల అవస్థలుయాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం...

పల్నాడు గురుకులంలో దారుణం! ఐదు రోజులుగా విద్యుత్, నీరు లేక విద్యార్థినుల అవస్థలుయాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం – తల్లిదండ్రుల ఫోన్ కాల్స్‌లో విలపిస్తున్న బాలికలు

డైనమిక్, వినుకొండ,నవంబర్2

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో (APREIS) విద్యార్థినులు గత ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌ ప్రాంగణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు తాగునీటి సమస్య కూడా నెలకొనడంతో విద్యార్థినులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నాయి.

పారిశుధ్య సమస్యలు తీవ్రం

నీటి లేమి కారణంగా విద్యార్థినులు తాగునీరు, స్నానం, శౌచాలయ వినియోగం వంటి మౌలిక అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని సమాచారం. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

సిబ్బంది చేతులెత్తేసిన పరిస్థితి

తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు పాఠశాల సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ, వారు “మేము ఏమీ చేయలేము” అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారని తెలిసింది. అధికార నిర్లక్ష్యం, తక్షణ స్పందన లేకపోవడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరు

విద్యార్థినులు తమ ఇబ్బందులను తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా వివరిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. “ఐదు రోజులుగా నీళ్లు లేకపోతే ఎలా? కనీసం తాగడానికి కూడా సరిగా నీరు దొరకడం లేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు” అని ఒక విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు మండిపడి, గురుకుల యాజమాన్యంపై ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి, నీటి సమస్యను పరిష్కరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments