అమరావతి,డైనమిక్ , అక్టోబర్ 27
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) నిరుద్యోగ యువతకు మరోసారి శుభవార్త తెలిపింది. రాతపరీక్ష లేకుండా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 277 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమై, నవంబర్ 8 వరకు కొనసాగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణయించిన గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విభాగాలవారీగా పోస్టులు:
ఈ నియామకాల్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) తదితర విభాగాల్లో అప్రెంటిస్ అవకాశాలు ఉన్నాయి.
జిల్లావారీ ఖాళీలు:
నంద్యాల జిల్లా – 43
కర్నూలు జిల్లా – 46
అనంతపురం జిల్లా – 50
శ్రీ సత్యసాయి జిల్లా – 34
కడప జిల్లా – 60
అన్నమయ్య జిల్లా – 44
ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సేవల విస్తరణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య అధికమవడంతో సంస్థలో సిబ్బంది అవసరం పెరిగిందని అధికారులు తెలిపారు.
