సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు “సి.ఎం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం” కింద విదేశాలలో చదువుకునేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి శ్రీ ఎల్. శ్రీనివాస్ తెలిపారు.
ఎవరు అర్హులు?
ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు వంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడ చదువుకోవచ్చు?
అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలలోPOST GRADUATE / DOCTORAL STUDIES కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆర్థిక సహాయం వివరాలు
ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ / ఆర్థిక సహాయం (రెండు విడతలలో)విమాన ప్రయాణ ఖర్చులుగా గరిష్టంగా రూ.60,000 వరకు అందించనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు.
దరఖాస్తు విధానం
01 జూలై 2025 నుండి 31 డిసెంబర్ 2025 మధ్య (ఫాల్ సీజన్ – 2025) అడ్మిషన్ పొందిన అభ్యర్థులుwww.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : 20-12-2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 19-01-2026 సాయంత్రం 5.00 గంటల వరకు
పత్రాల సమర్పణ చివరి తేదీ : 20-01-2026
పత్రాల సమర్పణ ఎక్కడ?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాత, సంబంధిత జతపత్రాలతో కలిసిజిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయం, సూర్యాపేటలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
వివరాలకు సంప్రదించండి
జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి,
IDOC భవనం, 1వ అంతస్తు, గది నం. F5, సూర్యాపేట ఫోన్ నం : 94926 11057
