Wednesday, January 14, 2026
HomeSPORTSయువజన-క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి NGOలకు ఆర్థిక సహాయం డిసెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి

యువజన-క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి NGOలకు ఆర్థిక సహాయం డిసెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్ 21,

యువజన అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ (NPYAD) పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి NGOల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. వెంకట్ రెడ్డి తెలిపారు.

దర్పన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో అందించే ఈ ఆర్థిక సహాయం పొందేందుకు సంబంధిత NPOs/NGOs తప్పనిసరిగా దర్పన్ పోర్టల్‌ (https://ngodarpan.gov.in)లో రిజిస్టర్ అయి ID పొందినవారై ఉండాలని తెలిపారు.

కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులకే అవకాశం

గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద ఆర్థిక సహాయం కోరే అర్హ సంస్థలు నవంబర్ 30వ తేదీ లోపు యూత్ అఫైర్స్ అధికారిక వెబ్‌సైట్http://youth.yas.gov.in/scheme/npyad/ngo/loginద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

జిల్లా యువజన-క్రీడల శాఖ విజ్ఞప్తి

జిల్లాలోని అర్హతగల అన్ని NPOs/NGOs ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమయానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వెంకట్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments