Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంమోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలి సిఐటియు జిల్లా మహాసభలు 29, 30 తేదీల్లో...

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలి సిఐటియు జిల్లా మహాసభలు 29, 30 తేదీల్లో నల్గొండలో 29న భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించనున్న సిఐటియు

నల్లగొండ బ్యూరో,డైనమిక్,నవంబర్9

నల్గొండ పట్టణంలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగబోయే సిఐటియు (CITU) నల్గొండ జిల్లా 13వ మహాసభల సందర్భంగా, 29న భారీ కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి. సలీం పిలుపునిచ్చారు.ఆదివారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా తిరగబడాల్సిన అవసరం ఉంది. దేశంలోని 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్పులు చేయడం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య” అని సలీం విమర్శించారు.

సిఐటియు పోరాట పంథాను కొనసాగిస్తున్నాం

సిఐటియు 1970లో “ఐక్యత – పోరాటం” నినాదంతో ఆవిర్భవించిందని గుర్తు చేసిన సలీం, “ఆ నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గ హక్కుల కోసం సిఐటియు నిరంతర పోరాటాలు చేస్తూ విజయాలు సాధించింది” అని అన్నారు.మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్మికుల సాధించిన హక్కులను హరించి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తెరతీసిందని, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందర కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి, వాటిలో ఒక్కటీ అమలు చేయలేదని సిఐటియు నేతలు విమర్శించారు. “కార్మికులను మోసం చేసే ధోరణిని నిలువరించేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలి” అని పిలుపునిచ్చారు.

మహాసభలకు పెద్ద ఎత్తున హాజరవ్వాలి

నవంబర్ 29, 30 తేదీలలో నల్గొండలో జరగబోయే సిఐటియు జిల్లా మహాసభలు సందర్భంగా 29న జరిగే కార్మిక ప్రదర్శనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సలీం కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్నవారు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట్ రవీందర్, యూనియన్ అధ్యక్షుడు ఆవురేశు మారయ్య, కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, కోశాధికారి మేడబోయిన వీరబాబు, కృష్ణయ్య, వీరయ్య, చంద్రయ్య, అశోక్, నాగరాజు, శంకర్, వెంకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments