Monday, March 2, 2026
Homeతాజా సమాచారంNPL–6కు అన్ని విధాలా సహకారం గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే...

NPL–6కు అన్ని విధాలా సహకారం గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే NPL-6 పోస్టర్ ఆవిష్కరణ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL–6 టోర్నమెంట్ పోస్టర్‌ను మంత్రి బుధవారం సెక్రటేరియట్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు.

టోర్నమెంట్‌కు పూర్తి సహకారం

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అథ్లెట్లకు ఇలాంటి క్రీడలు మంచి వేదిక. టోర్నమెంట్ విజయవంతం కావడానికి ప్రభుత్వం నుంచి కావాల్సినంత సహకారం అందిస్తాం” అని హామీ ఇచ్చారు.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయగల వేదిక

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ,“గ్రామీణ ప్రతిభను రాష్ట్రానికి పరిచయం చేయడంలో ఈ టోర్నమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. క్రీడాకారులంతా పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాలి” అని కోరారు.

బహుమతుల వివరాలు

మొదటి బహుమతి: ₹2,22,222,ద్వితీయ బహుమతి: ₹1,11,111,విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రత్యేక సన్మానాలు కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

హాజరైన వారు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, నిర్వాహకులు బోనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, పాలకూరి శ్రీధర్, గంజి గిరి, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి, సాయి, చిన్ని రంగ, మధు, నవీన్ రెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments