డైనమిక్,నల్గొండ బ్యూరో
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ, నల్గొండ జిల్లా పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతి శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మహంతిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.జిల్లా కాంగ్రెస్ కార్యకలాపాలు, స్థానిక రాజకీయ సమీకరణలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
