డైనమిక్, సూర్యాపేట బ్యూరో,నవంబర్8
సూర్యాపేట మండలంలోని కెటి అన్నారం గ్రామంలో కోడిదెల బిక్షం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సేవలను స్మరించిన నేతలు
ఈ సందర్భంగా వారు బిక్షం రెడ్డి పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.ఆయన ప్రజల పట్ల చూపిన సేవాభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు కురెళ్ళి శరభాచారి, మాజీ సర్పంచ్ బైరెడ్డి భీమ్ రెడ్డి, కోడిదెల శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి నర్సిరెడ్డి, ఉయ్యాల సైదులు, నాగుల మీరా, బైరెడ్డి సుధాకర్ రెడ్డి, వల్లమల్ల నారాయణ, ఆదిమల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
