మిర్యాలగూడ , డైనమిక్ న్యూస్,నవంబర్16
మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ఆదివారం బీసీ యువజన సంఘం న్యాయసాధన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీల హక్కులను అణచే రాజకీయ శక్తులకు గుణపాఠం చెప్తాం
బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే బీసీ సమాజం తగిన బుద్ధి చెప్తుందన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునే కొంతమంది అగ్రవర్ణ వర్గాలకు ప్రజలు త్వరలోనే సముచిత గుణపాఠం చెప్తారని అశోక్ హెచ్చరించారు.
నాయకులు, సంఘ ప్రతినిధుల భారీ పాల్గొనం
దీక్ష కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు తమ్మడ బోయిన అర్జున్, ఎంఢీ సలీం, పగిడి రామలింగ యాదవ్, దశరథ్ నాయక్, పోలగాని వెంకటేష్ గౌడ్, జక్క నాగేశ్వరరావు, సిద్ధం రాజు, బోయపల్లి రవీందర్ గౌడ్, ఉపేందర్, ఎర్రవెల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
