డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 17
హర్యానా రాష్ట్రానికి చెందిన దళిత ఐపీఎస్ అధికారి పురణ్‌కుమార్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్, మాలమహానాడు నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట పట్టణంలోని రైతు బజార్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — హర్యానా రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ, రోహతక్ జిల్లా ఎస్పీతో పాటు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, జిల్లా సహాయ కార్యదర్శి టేకుల సుధాకర్, మాలమహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామ వేణు, ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య, నాయకులు చినపంగి నరసయ్య, దేవరకొండ గిరి, సాయికుమార్, తిరుపతి, గోపి తదితరులు పాల్గొన్నారు
