డైనమిక్, నేరేడు చర్ల,నవంబర్ 3
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్ సబ్ డివిజన్ (ADE) కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల సమస్యలను స్వీకరించి పరిష్కరించ నున్నట్లు నేరేడుచర్ల విద్యుత్ ఏఈ రవి ఒక ప్రకటనలో తెలిపారు.విద్యుత్ వినియోగదారులు తమకు ఉన్న ఎలాంటి సమస్యలైనా లిఖిత పూర్వకంగా దరఖాస్తు రూపంలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల మధ్యలో సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి నేరేడుచర్ల మండల పరిధిలోని విద్యుత్ సమస్యలు వున్న వినియోగదారులు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు.
