Thursday, January 15, 2026
Homeజాతీయంఆధార్ అప్‌డేట్‌లో విప్లవాత్మక మార్పు నవంబర్ 1 నుంచి ఇంటి వద్దే ఆధార్ సేవలు

ఆధార్ అప్‌డేట్‌లో విప్లవాత్మక మార్పు నవంబర్ 1 నుంచి ఇంటి వద్దే ఆధార్ సేవలు

డిల్లీ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28

ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన తిప్పలు లేవు. కోట్లాది ఆధార్ కార్డు హోల్డర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది. నవంబర్ 1 నుంచి ఆధార్ వివరాల అప్‌డేట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు అమల్లోకి రానున్నాయి.

ఇక ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే

ఇకపై పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. UIDAI రూపొందించిన కొత్త డిజిటల్ విధానం ద్వారా ఇది మరింత వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా జరుగనుంది.

ఫీజుల్లో మార్పులు – పెరిగిన రుసుములు

UIDAI ఇటీవల ఫీజుల్లో మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి.పేరు, చిరునామా వంటి చిన్న మార్పులకు ₹75బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ₹125మొదట ఉచితంగా ఉన్న డాక్యుమెంట్ అప్‌డేట్ సదుపాయం జూన్ 14తో ముగిసింది. ఇకపై అన్ని అప్‌డేట్‌లకు ఫీజు తప్పనిసరి.

పిల్లలకు ప్రత్యేక సదుపాయం

7 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లలకు UIDAI పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఈ వయసు గల పిల్లల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. తల్లిదండ్రులు ఇక ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒక ఆధార్ – ఒక వ్యక్తి మాత్రమే

UIDAI స్పష్టంగా హెచ్చరించింది: ఒక వ్యక్తికి ఒకే ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నకిలీ లేదా బోగస్ ఆధార్ కార్డులు వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు మాత్రం కేంద్రాలకే వెళ్లాలి

నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్‌డేట్ విధానం ప్రారంభమైనా, బయోమెట్రిక్ వివరాల మార్పులకు మాత్రం ఆధార్ సేవా కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ వంటి అంశాలు భౌతికంగా నమోదు చేయాల్సిన అవసరం ఉండటమే ఇందుకు కారణం.

గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట

ఈ డిజిటల్ మార్పులతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్ద సౌకర్యం లభించనుంది. ఇప్పటివరకు చిన్న మార్పులకే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇకపై ఇంటి వద్ద నుంచే ఆధార్ అప్‌డేట్‌లు చేయగలుగుతారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments