హుజూర్నగర్, నవంబర్ 21, డైనమిక్ న్యూస్
హుజూర్నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించిన రాధాకృష్ణ చౌహాన్ సూర్యాపేట ఫస్ట్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లడం సందర్భంగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం జరిగింది.
జడ్జికి బార్ అసోసియేషన్ ఘన సత్కారం
సన్మాన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చి. యాదగిరి, లైబ్రరీ కార్యదర్శి చిత్రం విశ్వనాథ్ పాల్గొన్నారు.
సీనియర్–జూనియర్ న్యాయవాదుల హాజరు
సీనియర్ న్యాయవాదులు ఎస్. రవికుమార్, కుక్కడపు బాలకృష్ణ, నెట్టే సత్యనారాయణ, కృష్ణయ్య, మాధవరెడ్డి, వీజీకే మూర్తి తదితరులు జడ్జిని అభినందించారు. జూనియర్ న్యాయవాదులు కూడా బారీస్థాయి హాజరై చౌహాన్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వీడ్కోలు సందర్భంగా శుభాకాంక్షలు
పదోన్నతి పొందిన చౌహాన్ కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని న్యాయవాదులు ఆకాంక్షించారు. హుజూర్నగర్ కోర్టులో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
