డైనమిక్ డెస్క్,హైదరాబాద్, అక్టోబర్ 29
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు రేపు — అక్టోబర్ 30వ తేదీన — సెలవు రానుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 8 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని SFI నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. బకాయిలను నవంబర్ మొదటి వారంలోగా విడుదల చేయకపోతే ‘ఛలో హైదరాబాద్’ పేరుతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి.
అక్టోబర్ 30, గురువారం ప్రభావం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు బంద్
డిమాండ్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల తక్షణ విడుదల విద్యార్థులకు న్యాయమైన సహాయం అందించడం ఉన్నత విద్యకు అవసరమైన నిధుల కేటాయింపు ఈ బంద్ నేపథ్యంలో రాష్ట్ర విద్యా సంస్థల్లో పాఠాలు నిలిచిపోనున్నాయి. విద్యార్థి సంఘాలు శాంతియుతంగా బంద్ కొనసాగించాలని పిలుపునిచ్చాయి.
