నేరేడుచర్ల, అక్టోబర్ 28 (డైనమిక్)
నేరేడుచర్ల మున్సిపాలిటీలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్‌ను మంగళవారం సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి ప్రారంభించారు.
సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ __
రైతులు ఇకపై మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా స్వచ్ఛందంగా ఐకెపి సెంటర్ ద్వారా ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చని తెలిపారు. రైతులకు సరైన ధర లభించేలా, పారదర్శక లావాదేవీలతో ప్రభుత్వం వ్యవస్థను అమలు చేస్తోందని అన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ
“గ్రామీణ స్థాయిలో ఐకెపి సెంటర్లు రైతులకు భరోసా కల్పించే వేదికలు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.
రైతులు ఆనందం హర్షం వ్యక్తం
ఐకెపి సెంటర్ ప్రారంభంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు దళారుల చేత ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగలుగుతున్నాం” అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురిగి సైదులు, పట్టణ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, మాజి మున్సిపల్ ఛైర్మన్ ప్రకాష్,బెల్లంకొండ నరసింహారావు, ఆకారపు వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
