హైదరాబాద్ ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కి పితృవియోగం కలిగింది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో స్వగృహంలో పార్థివదేహం
తన్నీరు సత్యనారాయణ పార్థివదేహం హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్ నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
రాజకీయ, ప్రజాసేవలో గుర్తుండే కుటుంబం
తన్నీరు కుటుంబం సిద్దిపేట ప్రాంతంలో రాజకీయ, ప్రజాసేవలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. హరీష్ రావు పలు పదవుల్లో పనిచేసి ప్రజలకు సాన్నిహితంగా ఉన్న నాయకుడిగా పేరుపొందారు. తండ్రి మరణం ఆయనకు, కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
