హైదరాబాద్ , డైనమిక్ , అక్టోబర్ 27
పత్తి రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి పంటను మార్కెట్ యార్డులు లేదా జిన్నింగ్ మిల్లులకు విక్రయించేందుకు తీసుకువెళ్లే ముందు తేమ శాతం 12 మించకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. తేమ శాతం అధికంగా ఉంటే కనీస మద్దతు ధర (MSP) పొందే అవకాశం లేకపోతుందని మంత్రి హెచ్చరించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తేమ శాతం ఎక్కువగా ఉన్నా రైతులకు నష్టమవకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
