Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు, లోకేష్ రాక..!జూలకంటి తనయుడి వివాహ రిసెప్షన్…

నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు, లోకేష్ రాక..!జూలకంటి తనయుడి వివాహ రిసెప్షన్…

What is your favorite form of physical exercise?

డైనమిక్,.వెల్దుర్తి

మాచర్ల నియోజకవర్గం మండల కేంద్రం వెల్దుర్తి లో సోమవారం అంగరంగ వైభవంగా జరగనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు ఎం.పి.లు, ఎం ఎల్ ఏ లు, ఎం ఎల్ సి లు,పార్టీ నాయకులు, అలనాడు,జిల్లా లోని టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు.50 వేల మంది హాజరవుతారన్న అంచనా తో భారీగా జూలకంటి బ్రహ్మనందరెడ్డి టీమ్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్బంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఎదురు దాదాపు 10 ఎకరాల్లో అట్టహాసంగా పార్టీ శ్రేణులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ జరిగే ప్రాంతం లో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా భారీగా షెడ్లు వేశారు. ప్రజల రాకపోకలు ఇబ్బంది లేకుండా రోడ్లు వేశారు.భారీ గా లిఫ్టింగ్ ఏర్పాటు చేసారు . సుందంగా రిసెప్షన్ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. వి ఐ పి ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. అలాగే విందులో వడ్డించేందుకు రావులపాలెం స్వీట్ల తో పాటు పలురకాల వంటలు తయారు చేస్తున్నారు.ఎక్కడా ఇబ్బందులు లేకుండా వందల సంఖ్యలో వాలంటీర్లు ను నియమించారు. పోలీస్ స్టేషన్ సమీరంలో ఉన్న పాత ఆర్ &బి గెస్ట్ హౌస్ స్థలంలో హెలిప్యాడ్ నిర్మించారు. వందలాది వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసారు .రిసెప్షన్ స్టేజ్,ఫుడ్ కౌంటర్ వంటి పలు ముందస్తు ఏర్పాట్లను ఎమ్మెల్యే జూలకంటి పర్యవేక్షించారు. వెల్దుర్తి హై వే పై చంద్ర బాబు లోకేష్,బ్రహ్మారెడ్డి,ఇతర నాయకుల ఫ్లెక్సీ లు భారీగా ఏర్పాటు చేసారు.ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో పార్టీ నాయకులు జమ్మిగుంపుల లక్ష్మీ నారాయణ, పంగులూరి పుల్లయ్య, మోహనరెడ్డి, కుర్రి శివారెడ్డి, కళ్ళం రామాంజిరెడ్డి, మధు యాదవ్,మండలపు రామకృష్ణ,మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి, కజ్జం సైదయ్య, జూలకంటి చిరంజీవి రెడ్డి, వెంకటరెడ్డి, యువ నాయకులు అక్కిరెడ్డి, పాపిరెడ్డి, కేశిరెడ్డి హనిమిరెడ్డి,శివారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments