డైనమిక్ డెస్క్,పట్నా, అక్టోబర్ 26
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందుగానే జేడీయూలో కలకలం రేగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా మొత్తం 11 మంది నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.పార్టీ ఐక్యతను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు జేడీయూ కేంద్ర నాయకత్వం వెల్లడించింది. సస్పెండ్ అయిన కొందరు టిక్కెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.పార్టీ లోపల పెరుగుతున్న అసంతృప్తిని నియంత్రించడానికి నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల ముందు జేడీయూకు ఇది పెద్ద పరీక్షగా మారింది.
