Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంమున్సిపాలిటీలకు భారీ నజరానా – రేవంత్ సర్కార్ బంపర్ గిఫ్ట్

మున్సిపాలిటీలకు భారీ నజరానా – రేవంత్ సర్కార్ బంపర్ గిఫ్ట్

హైదరాబాద్, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 25

రాష్ట్ర పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు విడుదల చేసింది. పట్టణాభివృద్ధి పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రూ.2,780 కోట్లను విడుదల చేసింది.138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం మొత్తం 138 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 2,432 అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించారు.

వెంటనే టెండర్లు పిలవాలన్న సీఎం ఆదేశం

ఈ నిధులతో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన పట్టణ ప్రాంతాల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి ఇతర అన్ని పట్టణాలకు ఈ నిధులు మంజూరు అయ్యాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2027″లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.“గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలి. ప్రతి మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకుంటాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments