Tuesday, January 13, 2026
Homeక్రైమ్వృద్దురాలి హత్య కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్

వృద్దురాలి హత్య కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 22

హుజూర్నగర్ పోలీసులు దర్యాప్తుతో నిందితుల బృందం బట్టబయలు
రూ.3.60 లక్షల విలువైన బంగారం, రెండు ఫోన్లు స్వాధీనం

హత్య, దొంగతనంగా మారిన అనుమానాస్పద మరణం

హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఇల్లు గల చెన్న అనసూర్యమ్మ (వయస్సు 60 ఏళ్లు) ఈ నెల 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శరీరంపై గాయాలు కనిపించడంతో హత్య అనుమానం వ్యక్తమైంది.మృతురాలి పెద్ద కుమారుడు చెన్న వేణు వగ్మూలం, సాంకేతిక ఆధారాల సేకరణ అనంతరం కేసును హత్య, దొంగతనం కేసుగా నమోదు చేశారు

పరిచయం పేరుతో దారుణం

హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వారిలో లింగం సతీష్ అనే వ్యక్తి మృతురాలికి పరిచయమున్నవాడు. అతను గతంలో వృద్దురాలి వద్ద రూ.50 వేల అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆగ్రహం, దురాలోచన కలిగినట్లు పోలీసులు గుర్తించారు.వృద్దురాలు ఒంటరిగా ఉంటున్నది గమనించిన సతీష్, తన మేనల్లుడు (మైనర్ బాలుడు)తో కలిసి అక్టోబర్ 14 రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. మద్యపానం చేసిన అనంతరం రాత్రి ఒక గంట సమయంలో సతీష్ ఆమె నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చంపగా, మైనర్ బాలుడు ఆమె కాళ్లు పట్టుకున్నాడు.

బంగారాన్ని కరిగించి దాచిపెట్టిన నిందితులు

హత్య అనంతరం చెవుల్లో ఉన్న బంగారు దిద్దులు, మాటీలు, ఉంగరం, బనరు గొలుసు, బీరువాలో ఉన్న రూ.50 వేల ప్రామిసరీ నోట్ దొంగిలించారు. ఆ బంగారం మౌనికకు చూపించగా, ఆమె సలహా మేరకు విజయవాడకు తీసుకెళ్లి బంగారాన్ని కరిగించి దాచుకున్నారు.

పోలీసుల చాకచక్యం – నిందితుల అరెస్ట్

నమ్మదగిన సమాచారంపై హుజూర్నగర్ పట్టణంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. వారినుండి రూ.3.60 లక్షల విలువైన బంగారం, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు.

నిందితుల వివరాలు

లింగం సతీష్ (40), సుతారి మేస్త్రి, యాదవుల బజార్, హుజూర్నగర్,లింగం మౌనిక (35), గృహిణి, యాదవుల బజార్, హుజూర్నగర్,మైనర్ బాలుడు (16), కూలీ, స్వస్థలం భద్రాచలం, ప్రస్తుతం హుజూర్నగర్

ఎస్పీ హెచ్చరిక – నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదు

జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు —
“కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. ఎవరు నేరాలకు పాల్పడినా చట్టం తప్పించుకోలేరు,” అని ఆయన హెచ్చరించారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు

కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సి.ఐ చరమందరాజు, కానిస్టేబుల్ నాగరాజు, శంభయ్యలను ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు. హత్య దర్యాప్తులో సీసీటీవీ ఆధారాలను వినియోగించి నిందితులను గుర్తించిన వీరిని ఎస్పీ ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments