తిరుపతి,డైనమిక్ ,అక్టోబర్20
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న శ్రీవారిని 84,017 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీలో భక్తులు సమర్పించిన నాణ్యధనంగా రూ.4.97 కోట్లు ఆదాయం నమోదైంది.టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దర్శన సమయాలు పెరగడంతో భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణగా ఉండాలని వారు సూచించారు.
