Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంగ్రీన్ కార్డ్ లాటరీలో 2028 వరకు భారతీయులకు అవకాశం లేదు

గ్రీన్ కార్డ్ లాటరీలో 2028 వరకు భారతీయులకు అవకాశం లేదు

డైనమిక్,వాషింగ్టన్, అక్టోబర్ 19

అమెరికా డైవర్సిటీ వీసా (DV) లాటరీలో భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి, అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఇది భారతీయుల కోసం మరో ఎదురుదెబ్బగా మారింది.అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీలో గత ఐదేళ్లుగా ఎక్కువగా వలస వచ్చిన దేశాలు అర్హత కోల్పోవడం జరుగుతోంది. సంబంధిత అధికారులు వివరాల ప్రకారం, 2021లో 93,450, 2022లో 1,27,010, 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ఈ సంఖ్య అమెరికాకు వెళ్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్ వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల, “అల్ప వలస” దేశాలకు మాత్రమే లాటరీలో అవకాశం ఇవ్వాలన్న నిబంధన ప్రకారం, భారతీయులు 2028 వరకు ఈ లాటరీలో పాల్గొనలేరని అధికారులు వెల్లడించారు.ఇప్పటి వరకు భారతీయుల, చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ దేశాలు కూడా 2026 వరకు DV లాటరీలో అర్హత పొందలేదు.అదనంగా, అమెరికా సిటిజన్‌షిప్ & ఇమిగ్రేషన్ సర్వీస్ (USCIS) పెరోల్ ఫీజును 1,000 డాలర్లకు పెంచింది. పెరోల్ అనేది వీసా లేకుండా తాత్కాలికంగా అమెరికాలో ఉండడానికి ఇచ్చే అనుమతి. ట్రంప్ ప్రవేశపెట్టిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ప్రకారం, ప్రారంభ పెరోల్, రీ-పెరోల్, పెరోల్ ఇన్ ప్లేస్, DHS కస్టడీ నుండి పెరోల్ వంటి అన్ని రకాల ఫీజులు ఇప్పుడు 1,000 డాలర్లుగా నిర్ణయించబడ్డాయి. ఈ ఫీజు ఇప్పటికే ఉన్న ఇమిగ్రేషన్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుములకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఈ చర్యల కారణంగా భారతీయ వలసదారులకు అమెరికా వీసా విధానంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments