డిల్లీ, అక్టోబర్ 19,డైనమిక్
దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరింతగా పెరిగి ఆందోళన కలిగిస్తోంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) పూర్ కేటగిరీలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీవో ప్రాంతంలో ఏక్యూఐ 284గా నమోదైంది.వాతావరణ మార్పులు, వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక పొగలు వలన కాలుష్య స్థాయిలు రోజురోజుకు పెరుగుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్లపై నీటి తుంపర (వాటర్ స్ప్రింక్లర్స్) పిచికారీ చేసి దూళి కణాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.అలాగే, నిర్మాణ పనులపై నియంత్రణ, వాహనాల తనిఖీలు, గ్రీన్ వార్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది.
