తెలంగాణా,హైదారాబాద్, డైనమిక్
బార్బడోస్‌లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న తెలంగాణ ప్రతినిధి బృందం ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించింది.ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, ఇతర అధికారులు భారత రాయబార కార్యాలయంలో చీఫ్ అంబాసిడర్ సంజీవ్ సింఘాలాతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవస్థ, శాసనసభా ప్రక్రియలు, అంతర్జాతీయ సంబంధాల పరంగా ఇరు పక్షాలు చర్చించాయి. తెలంగాణ శాసనసభ కార్యకలాపాలు, ఆధునిక శాసన సాంకేతికతలపై కూడా పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు.
