హైదారాబాద్,డైనమిక్, అక్టోబర్ 18
తెలంగాణకు కొత్తగా 108 పీజీ మెడికల్ సీట్లు
తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యారంగానికి శుభవార్త అందింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 108 కొత్త పీజీ సీట్లను మంజూరు చేసింది. ఈ సీట్ల ఆమోదంతో తెలంగాణలో పీజీ వైద్య విద్య అవకాశాలు విస్తరించనున్నాయి. కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఇది ప్రోత్సాహకర పరిణామమని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వైద్య విద్యా మౌలిక సదుపాయాల విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుందని టీజీడీఏ అధ్యక్షుడు డా.నరహరి పేర్కొన్నారు.
