డైనమిక్,కోదాడ,17 అక్టోబర్
ఎలక్ట్రిసిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడే ఏకైక యూనియన్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అని రాష్ట్ర కార్యదర్శి జి.సాయిబాబా అన్నారు.తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పట్టణంలో యూనియన్ నాయకులు నాదెళ్ళ బాలకృష్ణ నివాస గృహములో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.సాయిబాబా పాల్గొని మాట్లాడారు.కార్మికుల సమస్యలు పరిష్కారానికి ముందుండి,అనేక ఉద్యమాలు నిర్వహించి విజయం సాధించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తెలుసుకొని పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో
హుజుర్ నగర్ డివిజనల్ ఇంజనీర్ ఎన్.వెంకట కృష్ణయ్య, కోదాడ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏం.వెంకన్న,కే.వేణు, జిల్లా అధ్యక్షులు నేతకాని వెంకన్న, నాదేళ్ల బాలకృష్ణ, యాదగిరి నాయుడు,జి.నర్సింహారెడ్డి, వీరేపల్లి మధుసూదన్ రావు, కే.వెంకటేశ్వర్లు, వీ.సోమయ్య, సిహెచ్.రవిబాబు, కే.శిరీష, వెంకటనారాయణ, ఎన్.దయాకర్రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.
