Thursday, January 15, 2026
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు

నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

డైనమిక్,నల్లగొండబ్యూరో, అక్టోబర్ 17

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరియు పోలీస్ ఫ్లాగ్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.ఈ పోటీలు పోలీస్ అమరవీరుల సేవా స్పూర్తిని స్మరించుకునే ఉద్దేశ్యంతో అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరగనున్న వారోత్సవాల్లో భాగంగా నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు.పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో చూపిన స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో అందించిన సేవలు, ప్రజా రక్షణలో చేసిన త్యాగాలు, పోలీస్ విభాగ ప్రతిష్టను పెంచే అంశాలపై తీసిన ఫోటోలు, షార్ట్ ఫిల్మ్స్ ఈ పోటీలకు అర్హమవుతాయి.2024 అక్టోబర్ నుండి 2025 అక్టోబర్ వరకు తీసిన మూడు ఫోటోలు (10×8 సైజ్‌లో) మరియు 3 నిమిషాల లోపు నిడివి గల షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే నామినేషన్‌కు అర్హమని ఎస్పీ గారు తెలిపారు.పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ ఫోటోలు మరియు షార్ట్ ఫిల్మ్ పెన్ డ్రైవ్‌లో సాఫ్ట్ కాపీతో కలిపి ఈ నెల 23వ తేదీ లోపు నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సెక్షన్ విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments