డైనమిక్,కొండమల్లేపల్లి అక్టోబర్ 16
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం కొండమల్లేపల్లి పరిధిలో చోటుచేసుకుంది మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండల పరిధిలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన జిట్ట మోని శ్రీనయ్య వెంకటమ్మల కుమారుడు వెంకటేష్ (22) తల్లిదండ్రులకు ఆసరాగా వ్యవసాయం పనులు చేస్తూ వృత్తిరీత్యా ప్లంబర్ వర్క్ చేసేవారు గురువారం వ్యవసాయ పని నిమిత్తం పొలం దగ్గరికి వెళ్ళగా దిగబడి ఉన్న విద్యుత్ తీగలు గమనించక తీగలను తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు గతంలో వ్యవసాయం పొలం వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకోగా విద్యుత్ అధికారులు స్పందించలేదని అధికారుల నిర్లక్ష్యo కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు కొండమల్లేపల్లిలోని విద్యుత్ ఉపకేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి విద్యుత్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై కఠిన చర్యలు చేపట్టి న్యాయం జరిగేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై అజ్మీర రమేష్ తెలిపారు
