మఠంపల్లి అక్టోబర్ 16, డైనమిక్
గర్భిణీ స్త్రీలు ఎక్కువ
పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని హుజుర్ నగర్ సిడిపిఓ వెంకట లక్ష్మీ కోరారు.సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలో ఉన్న కొత్త దొనబండ తండా అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అన్ని పోషక విలువలతో కూడిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలు అయిన పండ్లు,పాలు,గుడ్లు, మొలకెత్తిన గింజలు, జొన్న రొట్టెలు,ఆకు కూరలు,కూరగాయలు ప్రతి నిత్యము మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకో వాలని అన్నారు.ప్రతినిత్యం ఎదుగుతున్న పిల్లలు,గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డకు,తనకు ఎక్కువ మోతాదులో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిం చారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని,ప్లాస్టిక్ వలన కూడా చాలా అనారోగ్యానికి గురవు తున్నామని పోషణ ఆరోగ్యం మీద అవగాహన కల్పంచి,పోషణ మాసం పైన ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ శ్రీలిఖిత, ఐసిడిఎస్ సూపర్ వైజర్ నిర్మల, మాజీ సర్పంచ్ విజయబాల నాయక్,కార్యదర్శి నరేష్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎమ్ లు,ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు,మహీళలు తదితరులు పాల్గొన్నారు.

