Wednesday, January 14, 2026
Homedainamicబీసీ బందును జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపు

బీసీ బందును జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపు

నల్గొండ జిల్లా ప్రతినిధి / డైనమిక్

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ నెల 18న నిర్వహించనున్న బీసీ బందును జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు బిరుదోజు ఉష పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటూ వారి హక్కులను కించపరుస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీ సమాజం ఐక్యంగా కదలికలు చేపట్టి రిజర్వేషన్లను సాధించుకోవాలని, అదే సమయంలో రాజ్యాధికారాన్ని పొందే దిశగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం కావడానికి వ్యాపారవర్గాలు, విద్యాసంస్థలు, వాహనదారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సహకరించాలని బిరుదోజు ఉష కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments