Friday, May 29, 2026
Homeతాజా సమాచారంరాయని గూడెంలో మహిళా సంఘాల నూతన భవనానికి శంకుస్థాపన గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు భవనం...

రాయని గూడెంలో మహిళా సంఘాల నూతన భవనానికి శంకుస్థాపన గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు భవనం దోహదం చేస్తుంది : సర్పంచ్ గుండు రామాంజి గౌడ్

శుభోదయ డైనమిక్ , మే 26,హుజూర్‌నగర్

గరిడేపల్లి మండలం రాయని గూడెం గ్రామంలో మహిళా సంఘాల సంఘబంధం రెండవ నూతన భవనానికి గ్రామ సర్పంచ్, సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండు రామాంజి గౌడ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మహిళల అభివృద్ధికి సంఘబంధం భవనాలు ఉపయోగకరం

ఈ సందర్భంగా సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు సంఘబంధం భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకులకు సహకరించాలని కోరారు.

పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యుల పాల్గొనిక

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ కళ్యాణ్, సంఘబంధం సీసీ మేడం, ఉపసర్పంచ్ పిడమర్తి నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు శంభయ్య, కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు గుండు లక్ష్మమ్మ, గురవయ్య, అమరారపు తిమోతి రాజు, గుండు నర్సింహారావు, రాచమల్ల శ్రీకాంత్, అమరారపు పేతురు రాజు, బెక్కం విజయ్ జయరాజ్, సంఘబంధం అధ్యక్షురాలు గుండు అంజమ్మ, కుమారి, సుహాసిని, సావిత్రి, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments