డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, మార్చి 17
రైతు భరోసా 2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించిన దరఖాస్తులను రైతుల నుండి స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జావేద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులు నిర్దిష్ట గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
కొత్త పాస్‌బుక్ రైతులకు అవకాశం
కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొందిన రైతులు మరియు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తిచేసుకున్న వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఇప్పటివరకు దరఖాస్తు చేయని రైతులు కూడా అర్హులు
ఇంతకుముందే పాస్‌బుక్ వచ్చినప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేయని రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన రైతులు 20-03-2026 లోగా వివరాలు సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విధానం
రైతులు తమకు సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిను సంప్రదించి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అవసరమైన పత్రాలు
భూమి పాస్‌బుక్ జిరాక్స్
ఆధార్ కార్డు జిరాక్స్
బ్యాంకు ఖాతా జిరాక్స్
రైతు భరోసా అప్లికేషన్ ఫామ్
రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని 25-03-2026 లోగా దరఖాస్తులు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారి జావేద్ కోరారు.
