Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి— ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన

ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి— ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన

మాచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 9

నియోజకవర్గ పరిధిలో రైతుల ఆదాయం పెంపొందించేందుకు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులకు సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష

గురువారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమై, నియోజకవర్గంలో ఉద్యానవన పంటల సాగు విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు లాభదాయకమైన పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై అవగాహన

ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పామాయిల్, జామాయిల్, చింత, కుంకుడు, సీతాఫలం, మునగ తదితర ఉద్యాన పంటల వైపు రైతుల దృష్టిని మళ్లించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ పంటల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో సాగు విధానాల అధ్యయనం

సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉద్యానవన పంటల సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి అనుభవాలను మన ప్రాంత రైతులకు తెలియజేసి, ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలన్నారు.

సాంప్రదాయ పంటల నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు

సాంప్రదాయ పంటలైన పత్తి, మిరప, వరి సాగును క్రమంగా తగ్గించి, ఉద్యానవన పంటలతో పాటు అంతర పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీంతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments