నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 4
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ద్వారా అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియే పథకాల కింద ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. విజయేందర్ రెడ్డి తెలిపారు.
దరఖాస్తుల గడువు
అర్హులైన వారు 05 జనవరి 2026 ఉదయం 10:30 గంటల నుంచి 10 జనవరి 2026 రాత్రి 11:59 గంటల వరకుtgobmms.cgg.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన
ఈ పథకం ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మైనారిటీ మహిళలకు చిన్న వ్యాపారాల కోసం ఒక్కొక్కరికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.
రేవంతన్నా కా సహారా పథకం
ఫఖీర్, దుదేకుల వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
పత్రాల సమర్పణ
ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్స్, మిర్యాలగూడ రోడ్, నల్గొండలో సమర్పించవచ్చని సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఈ అవకాశాన్ని మైనారిటీ మహిళలు, ఫఖీర్, దుదేకుల వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. విజయేందర్ రెడ్డి కోరారు.
మరిన్ని వివరాలకు
ఎం.ఏ. ఫహీం, ఫీల్డ్ అసిస్టెంట్ – మొబైల్: 7981196060 ను సంప్రదించాలని తెలిపారు.
