Tuesday, January 13, 2026
Homeతాజా సమాచారంపొగమంచు వేళల్లో అప్రమత్తత తప్పనిసరి వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ ప్రజల భద్రతే పోలీస్...

పొగమంచు వేళల్లో అప్రమత్తత తప్పనిసరి వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ ప్రజల భద్రతే పోలీస్ లక్ష్యం – ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట బ్యూరో, జనవరి 4, డైనమిక్ న్యూస్

చలికాలం నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, రాత్రి వేళలు మరియు తెల్లవారుజామున పొగమంచు కారణంగా ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. పొగమంచు వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.

నిరంతర పోలీస్ పెట్రోలింగ్

జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల వెంట పోలీస్ శాఖ నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

వాహనదారులకు ముఖ్య సూచనలు

పొగమంచు వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలి. లైటింగ్ వ్యవస్థ సరిగా ఉందో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి. ఓవర్‌టేక్ చేయకూడదు, ఒకే లైన్‌లో వాహనం నడపాలి. పదే పదే లైన్ క్రాస్ చేయకుండా, ఇండికేటర్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాల మధ్య తగిన దూరం పాటిస్తూ, హారన్‌లు మరియు ఇతర వాహనాల శబ్దాలను గమనించాలని కోరారు.

ద్విచక్ర వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

హై-బీమ్ వాడకుండా లో-బీమ్ లైట్లు ఉపయోగించాలి

వేగం తగ్గించి సురక్షిత దూరం పాటించాలి

రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వినియోగించాలి

సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి

మలుపుల వద్ద ముందుగానే ఇండికేటర్ ఇవ్వాలి

రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను వీలైనంత వరకు నివారించాలి

గ్లౌవ్స్ ధరించి వాహన నియంత్రణపై దృష్టి పెట్టాలి

కార్లు, భారీ వాహనాల డ్రైవర్లకు సూచనలు

ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి

సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి

డిఫాగర్ వినియోగించాలి లేదా కిటికీలను స్వల్పంగా తెరవాలి

విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లు వాడాలి

పొగమంచు లేదా మలుపుల ప్రాంతాల్లో ఓవర్‌టేక్ చేయవద్దు

లైన్ మార్కింగ్‌లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనించాలి

వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేయాలి

సురక్షిత ప్రయాణానికి విజ్ఞప్తి

ప్రయాణాలకు ముందుగానే బయలుదేరి తొందరపడకుండా జాగ్రత్తగా నడపాలని ఎస్పీ సూచించారు. హెడ్లైట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. విజిబిలిటీ పూర్తిగా తగ్గినప్పుడు సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి వేచి ఉండాలని సూచిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments