నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 26
నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాలన్నింటి అభివృద్ధికి పార్టీలకతంగా కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
నూతన సర్పంచ్‌తో భేటీ
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కనగల్ మండలం పగిడిమర్రి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన నాగబెల్లి నాగమణి సైదులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌తో పాటు పగిడిమర్రి గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పార్టీలకతంగా పనిచేయాలని సూచించారు.పార్టీ నాయకుల పాల్గొనడంఈ కార్యక్రమంలో కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
